: రాజ్యాంగ సవరణ చేయాలంటూ స్పీకర్ కు నోటీసిచ్చిన టీడీపీ ఎంపీలు
రాజ్యాంగ సవరణ చేయాలంటూ టీడీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు నోటీసిచ్చారు. రాష్ట్రాల విభజన అంశం రాష్ట్రాలకు సంబంధం లేదనే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనప్పుడు... రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాలతో సంబంధం ఏమిటి? అంటూ నోటీసులో పేర్కొన్నారని సమాచారం.