: బిల్లును ప్రవేశపెట్టనిచ్చే సమస్యే లేదు: మోదుగుల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనిచ్చే సమస్యే లేదని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఎవరి ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు పనిచేస్తున్నామని, ఇందులో తప్పు పట్టేందుకు ఏదీ లేదని తెలిపారు. పార్టీ అధినేత తమకు అడ్డుచెప్పలేదని, తమది న్యాయపోరాటం అని అందరికీ తెలుసని ఆయన అన్నారు. బిల్లును అడ్డుకునేందుకు తమ వద్ద ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.