: అంతం కాదిది.. ఆరంభం: సుజనాచౌదరి
'అంతం కాదిది ఆరంభం' అని పార్లమెంటుకు చాటి చెబుతామని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బిల్లును అడ్డుకునేందుకు తమ ప్రణాళిక ఏమిటనేది మరి కాసేపట్లోనే అందరూ చూస్తారని అన్నారు. తింటూ తింటూ రుచులడగడమెందుకు? కొద్ది సేపు వేచి చూస్తే తమ విధానం ఏమిటనేది తెలుస్తుందని సుజనా తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకునేందుకు ఏం చేసేందుకైనా తాము వెనుకాడమని ఆయన స్పష్టం చేశారు.