: లక్షమంది పోలీసులు వచ్చినా 'సడక్ బంద్' ఆగదు: ఐకాస
'అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ' అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కాలయాపనకు నిరసనగా నిర్వహించ తలపెట్టిన 'సడక్ బంద్' కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విజయవంతం చేసి తీరుతామని తెలంగాణ ఐకాస స్పష్టం చేసింది.
'ప్రత్యేక రాష్ట్రం' కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని లక్ష మంది పోలీసులు వచ్చినా అడ్డుకోలేరని తెలంగాణ ఐకాస నాయకులు ధీమా వ్యక్తం చేశారు. తమను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుతో పాటు ఐకాస కన్వీనర్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు.