: యాహూ ఇండియా ఎండీగా గుర్మీత్ సింగ్ నియామకం
ప్రముఖ ఇ-మెయిల్ సర్వీస్ కంపెనీ యాహూ ఇండియా విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్ గా గుర్మీత్ సింగ్ నియమితులయ్యారు. ఆయన యాహూ భారతీయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ప్రధానంగా యాహూ వెబ్ పోర్టల్ వ్యాపార పర్యవేక్షణ, అభివృద్ధిపై ఆయన విధులు నిర్వర్తిస్తారని యాహూ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గుర్మీత్ గతంలో పోర్బ్స్ ఇండియా నెట్ వర్క్ 18లో పనిచేశారు.