: ప్రధాని కళ్ళెదుటే ఒకర్నొకరు తిట్టుకున్న కేంద్ర మంత్రులు
ఈ సాయంత్రం ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో వాడివేడి సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు శరద్ పవార్, కేవీ థామస్ లు దాదాపు కొట్టుకున్నంత పనిచేశారు. చక్కెర సబ్సీడీ అంశంపై వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో ఒకరినొకరు తీవ్ర పదజాలంతో దూషించుకున్నారు. ఇదంతా ప్రధాని చూస్తుండగానే జరగడం గమనార్హం.