: 55 మంది ఎంపీల సంతకాలతో అవిశ్వాస తీర్మానం పెడతాం: రాయపాటి సాంబశివరావు


కాంగ్రెస్ పార్టీ తమని బహిష్కరించి మంచే చేసిందని ఆ పార్టీ సస్పెన్షన్ కు గురైన ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి.. సొంత పార్టీ పైనే అవిశ్వాస తీర్మానం పెట్టినందుకు పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఇప్పుడు గురువారం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమని రాయపాటి ప్రకటించారు. ఇందుకోసం 55 మంది ఎంపీల సంతకాలను సేకరించామని ఆయన తెలిపారు.

అసెంబ్లీ తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించి తిరస్కరించి రాష్ట్రపతికి పంపితే.. సవరణలు చేయకుండా ఆ బిల్లునే పార్లమెంటులో ప్రవేశపెట్టడం సరికాదని ఆయన అన్నారు. రాష్ట్రపతి కనీసం న్యాయసలహాకు పంపకుండా బిల్లును ఆమోదించి ప్రభుత్వానికి రబ్బర్ స్టాంపులా మారిపోయారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బిల్లుకు మద్దతునివ్వాలని బీజేపీని బతిమాలుతోందని ఆయన విమర్శించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బిల్లును అడ్డుకుంటామని రాయపాటి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News