: 14వ తేదీన జిల్లా కోర్టులకు సెలవు ప్రకటించిన హైకోర్టు
వరంగల్ జిల్లాలో మేడారం మహా జాతర సందడిగా సాగుతోన్న సంగతి తెలిసిందే. మేడారం జాతరను పురస్కరించుకొని 14వ తేదీ, శుక్రవారం నాడు జిల్లా కోర్టులకు సెలవు ప్రకటిస్తూ హైకోర్టు సర్క్యులర్ ను జారీ చేసింది. సమ్మక్క-సారక్క జాతర ఈ నెల 15వ తేదీ వరకు జరగనుంది. జాతరకు వెళ్లే కోర్టు సిబ్బంది సౌకర్యార్థం ఈ సెలవును మంజూరు చేసినట్లు హైకోర్టు పేర్కొంది.