: 'ఇండియా షో'కి ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్
దాయాదుల మధ్య స్పర్థను వీడేందుకు మరో ముందడుగు పడింది. భారతదేశంలో తయారైన ఉత్పత్తులతో నిర్వహించే ఇండియా షోకి పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చేందుకు ముందుకొచ్చింది. లాహోర్ వేదికగా ఫిబ్రవరి 14న ప్రారంభమయ్యే ఈ షో మూడు రోజులపాటు జరగనుంది. ఇలాంటి నిర్ణయాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్యోత్స్న సూరి అన్నారు. ఈ షోలో భారత్ కు చెందిన వంద సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.