: జగన్ కేసులో కోర్టుకు హాజరైన బీసీసీఐ అధ్యక్షుడు
బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ నేడు జగన్ క్విడ్ ప్రొ కో కేసులో హైదరాబాదు సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఇండియా సిమెంట్స్ అధిపతి హోదాలో ఆయన విచారణకు వచ్చారు. కాగా, విచారణను కోర్టు మార్చి 21కి వాయిదా వేసింది. ఈ కేసులో జగన్, విజయసాయిరెడ్డిలకు కోర్టు వ్యక్తిగత హాజరు మినహాయింపునివ్వడంతో వారిద్దరూ కోర్టుకు రాలేదు. ఇక, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మరికొందరు ఐఏఎస్ అధికారులు కూడా ఈ కేసులో విచారణ నిమిత్తం నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. జగన్ కేసులో సీబీఐ పది చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.