: సఫారీ పేసర్ల ధాటికి ఆసీస్ విలవిల


తొలి టెస్టులో దక్షిణాఫ్రికా సీమర్ల ధాటికి ఆస్ట్రేలియా టాపార్డర్ విలవిల్లాడింది. నేడు సెంచూరియన్ లో మొదలైన మొదటి టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ను స్టెయిన్ గ్యాంగ్ హడలెత్తించింది. దీంతో, ఆ జట్టు 98 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. స్టెయిన్ కు రెండు, మోర్కెల్, మెక్లారెన్ లకు చెరో వికెట్ దక్కాయి. ప్రస్తుతం క్రీజులో షాన్ మార్ష్ (52 బ్యాటింగ్), స్టీవెన్ స్మిత్ (19 బ్యాటింగ్ ) ఉండగా, ఆసీస్ 4 వికెట్లకు 145 పరుగులతో ఆడుతోంది. కెప్టెన్ క్లార్క్ 23 పరుగులు చేసి స్టెయిన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

  • Loading...

More Telugu News