: నిజాం నగలతో మెరిసిన బ్రిటిష్ యువరాణి
బ్రిటిష్ యువరాణి కేట్ మిడిల్ టన్ నిజాం నగలు ధరించి మరింత కాంతులీనింది. లండన్లోని పోర్ట్రెయిట్ గ్యాలరీలో జరిగిన ఓ వేడుకకు హాజరైన కేట్ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. జెన్నీ పెఖామ్ డిజైనర్ డ్రెస్సులో మెడలో కార్టియర్ వజ్రం పొదిగిన నెక్లెస్ తో కేట్ మెరిసిపోయిందని ఇంగ్లిష్ మీడియా పేర్కొంది. కాగా, ఈ వజ్రాన్ని నిజాం రాజు 1947లో క్వీన్ ఎలిజబెత్-2కి కానుకగా సమర్పించుకున్నాడు. డ్యూక్ ఆఫ్ ఎడింబరోతో ఆమె వివాహం సందర్భంగా నిజాం ఈ అరుదైన వజ్రాన్ని బహూకరించారు.