: జస్టిన్ బీబర్ విగ్రహం తొలగించనున్న టుస్సాడ్ మ్యూజియం
లండన్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ఉన్న కెనడియన్ యువ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ మైనపు విగ్రహాన్ని తొలగించాలని మ్యూజియం నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు మ్యూజియం జనరల్ మేనేజర్ బ్రెట్ పిడ్జియాన్ మాట్లాడుతూ,'బీబర్ విగ్రహం తొలగించే విషయం పట్ల చాలా అసంతృప్తి చెందుతున్నాము. కానీ, త్వరలో అదే ఆకర్షణతో మరో కొత్త విగ్రహానికి స్వాగతం చెబుతాము' అన్నారు. అయితే, చాలా సంవత్సరాలుగా రోజువారీ నిర్వహణ లేకపోవడంతో విగ్రహం బాగా దెబ్బతిన్నదని దానివల్ల అయిష్టంగానే ఈ నిర్ణయం తీసుకున్నామనీ మ్యూజియం వర్గాలు తెలిపాయి.