: ఓ భార్య.. ఐదుగురు భర్తలు..!
అలనాడు మహాభారతంలో ద్రౌపది పంచ పాండవులను పెళ్లాడితే అది దైవ ఘటన అని భావించాం. నేడు భారత్ లోనూ అలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జరిగిందీ విచిత్రం. ఓ అమ్మాయి ఓ కుటుంబంలోని ఐదుగురు అన్నదమ్ముల్నీ వివాహం చేసుకుంది. ఏమంటే, అది తమ ఆచారమని వారు చెబుతున్నారు.
రాజోవర్మ అనే అమ్మాయి తొలుత గుడ్డు వర్మ అనే యువకుణ్ణి పెళ్ళాడి, అనంతరం అతని సోదరులు నలుగురినీ పెళ్ళి చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారందరూ ఒకే ఇంటిలో నివసిస్తున్నారట. ఇప్పుడు వారికి ఒకటిన్నర సంవత్సరాల బాబు. తన ఐదుగురు భర్తల్లో బాబుకు తండ్రెవరంటే రాజోవర్మ ముసిముసి నవ్వులు నవ్వుతుంది.
కొంచెం సిగ్గు పడుతూ, తనకు తెలియదని జవాబిస్తుంది. ఇక వీరి సంసారంలో ఎలాంటి అపశ్రుతులు లేవట. రాజోవర్మ తన చిన్న మరిదిని ఇటీవలే పెళ్ళి చేసుకుంది. అతనికి పద్దెనిమిది ఏళ్ళు నిండడంతో అతన్నీ తన భర్తగా స్వీకరించిందీ అభినవ పాంచాలి.