: మున్ముందు ఆన్ లైన్ లోనే అన్నీ.. రైలు ప్రయాణంలో భోజనం కూడా బుక్ చేసుకోవచ్చు..!


ఇప్పటి వరకూ రైల్వే రిజర్వేషన్ టికెట్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకొనే సదుపాయం ఉంది. అయితే, ఈ తరహా టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులకు రైల్వే శాఖ మరికొన్ని సదుపాయాలను కల్పించింది. ఆన్ లైన్ లోనే భోజనాన్ని కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని ఈ రైల్వే బడ్జెట్ లో కల్పించారు.

అన్ రిజర్వుడు కేటగిరిలో టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకొనే సదుపాయాన్ని రైల్వే శాఖ కల్పించింది. దాంతో, మొబైల్ ఫోన్ల ద్వారానే అన్ రిజర్వుడు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే వెయిటింగ్ లిస్ట్ లో ఉండే పాసింజర్లకు టికెట్ కన్ ఫర్మ్ కాగానే పీఎన్ఆర్ స్టాటస్ లో బెర్త్ ఖరారైన విషయాన్ని మొబైల్ సంక్లిప్త సందేశం (ఎస్సెమ్మెస్) ద్వారా తెలియజేయనున్నట్లు రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ఈరోజు పార్లమెంటులో ప్రకటించారు.

  • Loading...

More Telugu News