: 'గాంగ్నమ్' డ్యాన్స్ చేయాలనిపిస్తోందంటున్న యువీ
నిజంగా యువరాజ్ సింగ్ అదృష్టవంతుడే. కాకపోతే, ఇటీవల కాలంలో ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడకుండానే ఐపీఎల్ వేలంలో అదిరిపోయే ధర పలకడం అందరికీ సాధ్యమయ్యే పనేనా..! ప్రస్తుతం తనకు పట్టిన అదృష్టానికి తానే మురిసిపోతున్నాడీ పంజాబ్ వీరుడు. గాంగ్నమ్ డ్యాన్స్ చేయడానికి ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుందని ట్విట్టర్లో కామెంట్ చేశాడు. నేటి ఐపీఎల్-7 వేలంలో యువీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 14 కోట్లు పోసి కొనుక్కుంది. బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తుండగా, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి విధ్వంసక శక్తులతో పటిష్టంగా కనిపిస్తోంది. యువీలాంటి ఆల్ రౌండర్ చేరికతో ఇప్పుడా జట్టుకు సమతూకం వచ్చినట్టైంది.