: విజయవాడలో జాతీయ రహదారుల దిగ్బంధం
తెలంగాణ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు (బుధవారం) జాతీయ రహదారుల దిగ్బంధం చేపట్టారు. విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద ఉద్యోగులు, విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో చెన్నై-కోల్ కతా రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అటు గొల్లపూడి వై జంక్షన్ వద్ద సమైక్యవాదులు రహదారులను దిగ్బంధించడంతో విజయవాడ-హైదరాబాదు జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.