: సీఎం రాజీనామా వార్తలపై బొత్స వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విభజనపై సీడబ్య్లూసీ నిర్ణయం వెలువడిన రోజే సీఎం రాజీనామా చేయకపోవడం చారిత్రక తప్పిదమన్నారు. అప్పుడే అందరం రాజీనామా చేసుంటే హైకమాండ్ పరిష్కారం చూపేదని బొత్స అన్నారు. ఇప్పుడు రాజీనామా చేయడంవల్ల ప్రయోజనం లేదని, ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లెవరూ ఇప్పుడు అలాంటి పనులు చేయరనీ అన్నారు. రాష్ట్రంలోని ఓ సామాజిక వర్గం కాంగ్రెస్ ను నాశనం చేయాలని చూస్తోందన్నారు. కాగా, బొత్స వ్యాఖ్యలపై మీడియా సీఎం స్పందనను కోరగా రేపు మాట్లాడతానని చెప్పారు.