: పీసీసీ చీఫ్ బొత్స భార్య నిరసన


కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయత ప్రకటించే పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ భార్యే లోక్ సభలో నిరసనకు దిగింది. ఎంపీలను సస్పెండ్ చేయడం కాంగ్రెస్ సీమాంధ్ర నేతలపై ప్రభావం చూపిస్తోంది. నిన్నటి వరకు ఆందోళనల్లో పాలు పంచుకోని ఎంపీలు కూడా నిరసనల్లో పాలు పంచుకుంటున్నారు. సాక్షాత్తూ పీసీసీ చీఫ్ బార్య బొత్స ఝాన్సీ నిరసన తెలిపేందుకు వెల్ లోకి దూసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమెను తెలంగాణ ఎంపీలు అడ్డుకుని వారించారు. అయినప్పటికీ ఝాన్సీ ప్లకార్డు పట్టుకుని వెల్ లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News