: గళం విప్పిన కేంద్ర మంత్రులు


ఎంపీలపై వేటు కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టించినట్టుంది. నిన్నటి వరకు తమతమ స్థానాలకు పరిమితమైన సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు ఎంపీలకు జత కలిశారు. లోక్ సభలో జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. తొలిసారిగా వెల్ లోకి ప్లకార్డులతో వచ్చి నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, పళ్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఎంపీలతో కలిసి సభను అడ్డుకున్నారు. కిషోర్ చంద్రదేవ్, కిల్లి కృపారాణి తమ స్థానాల్లోనే ఉండి నిరసన తెలిపారు. దీంతో లోక్ సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.

  • Loading...

More Telugu News