: రాజ్యసభ మరోసారి వాయిదా
రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. రెండో వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభను సీమాంధ్ర ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. ఛైర్మన్ కనబడకుండా ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభలో ఏం జరుగుతుందో తెలియన గందరగోళం ఏర్పడింది. పర్యవసానంగా రాజ్యసభను మద్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు.