: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం
గంటపాటు వాయిదా అనంతరం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఎప్పటిలానే సభలో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సభ్యుల నిరసనల మధ్యే లోక్ సభ స్పీకర్ ప్రభుత్వ బిల్లులను చేపట్టారు. సభ్యులు బిల్లులను ప్రవేశపెడుతున్నారు. మరోవైపు రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే పార్లమెంటుకు చేరుకున్నారు. కొద్ది నిమిషాల్లో ఆయన తొలిసారి రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. యూపీఏ-2 ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్.