: ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే అరెస్టు
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రేను పోలీసులు ఈ రోజు చెంబూరులో అరెస్టు చేశారు. టోల్ గేట్ చెల్లింపు విధానంలో పారదర్శకత తీసుకురావాలని డిమాండు చేస్తూ ఎంఎన్ఎస్ మహారాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో చేపట్టింది. ఇందులో పాల్గొనేందుకు వెళుతున్న ఠాక్రేను పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే, బలవంతంగా అరెస్ట్ చేస్తే వెనకడుగు వేసేదిలేదని ఈ సందర్భంగా ఠాక్రే అన్నారు.