: మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా
సీమాంధ్ర ఎంపీల సమైక్య నినాదాలు, నిరసనతో రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. సభ మొదలైన కొంతసేపటికే ప్లకార్డులతో సీమాంధ్ర ఎంపీలు ఛైర్మన్ పోడియంలోకి వెళ్లి నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. దాంతో, సభ నడపలేని పరిస్థితి ఏర్పడింది. ఏఐఏడీఎంకే ఎంపీ మైత్రేయన్ కూడా పోడియంలో నిరసన వ్యక్తం చేశారు. ఇక ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఎప్పటిలాగే పెద్ద ప్లకార్డు పట్టుకుని తన నిరసన తెలిపారు. దాంతో, ఛైర్మన్ హమీద్ అన్సారీ రాజ్యసభను గంటపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లి పోయారు.