: ఐపీఎల్ వేలంలో రూ.14కోట్లు పలికిన యువరాజ్
ఊహించినట్లుగానే యువరాజ్ సింగ్ కు ఐపీఎల్-7 వేలంలో మంచి ధర పలికింది. యూవీని 14 కోట్ల రూపాయలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన్నుకుపోయింది. యువరాజ్ కోసం కింగ్స్ 11 పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ ను హైదరాబాద్ సన్ రైజర్స్ 5.5కోట్లకు కొనుగోలు చేసింది. సెహ్వాగ్ కు 3.20కోట్లు చెల్లించడానికి కింగ్స్ 11 పంజాబ్ ముందుకు వచ్చింది. ఇదే జట్టు ఆస్సీ మిచెల్ జాన్సన్ ను 6.50కోట్లకు ఎగరేసుకుపోయింది. కెవిన్ పీటర్సన్ కు ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.9 కోట్లు ఆఫర్ చేసింది. మురళీ విజయ్ ను రూ. 5 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది.