: ఆ చిన్నారికి కృత్రిమ చెవు


రెండు కుటుంబాల మధ్య ఇంటి నిర్మాణం విషయమై గొడవ. ఆ కోపం ఆరేళ్ల చిన్నారిపై చూపించింది మేనత్త. బాలుడిని తనతో బయటకు తీసుకెళ్లి పండ్లు కోసే చాకుతో ఆ చిన్నారి రెండు చెవులను రాక్షసంగా కోసేసింది. గడ్డంపై గాయాలు చేసేంది. గత నెల 28న చైనాలోని హుబీ ప్రావిన్స్ పరిధిలో ఇది జరిగింది. వెంటనే బాలుడిని గ్జియాంగ్ పట్టణంలోని ఒక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సర్జరీ ద్వారా కుడి చెవిని తిరిగి అతికించారు. ఎడమవైపు చెవి దొరక్కపోవడంతో ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ బాలుడికి కృత్రిమ చెవు అమర్చనున్నారు. దీనివల్ల తన కొడుకు వినికిడి శక్తిపై ఏ మాత్రం ప్రభావం ఉండదని ఆ బాలుడి తండ్రి పేర్కొన్నాడు. ప్రజల నుంచి 3లక్షల రూపాయలకు పైగా విరాళాల రూపంలో రాగా.. ఆస్పత్రి మాత్రం ఉచితంగా సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చింది. ఆ రాక్షస మేనత్త మాత్రం జైలులో కాలక్షేపం చేస్తోంది.

  • Loading...

More Telugu News