: ‘మేడారం జాతర’కు జంట నగరాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
వరంగల్ జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమవుతోన్న మేడారం మహాజాతర కోసం జిల్లావ్యాప్తంగా 375 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఐదు రోజులు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వరంగల్ జిల్లాలోని ఆరు డిపోల నుంచి 375 బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. భక్తుల కోసం అన్ని బస్ స్టేషన్ లలో అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు రీజినల్ మేనేజర్ చెప్పారు.