: ధోనీ, రైనాలపై వేలెత్తిచూపుతున్న ముద్గల్ రిపోర్టు!


ఐపీఎల్ ఫిక్సింగ్ పై సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ ముద్గల్ కమిటీ దర్యాప్తులో పలువురు క్రికెటర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా, టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా పాత్రపైనా ముద్గల్ కమిటీ కీలక సమాచారం సంపాదించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తన నివేదికలో వారిద్దరి పేర్లు కూడా పొందుపరిచినట్టు సమాచారం. ధోనీ, రైనా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధోనీ చెన్నై జట్టుకు నాయకత్వం కూడా వహిస్తున్నాడు. చెన్నై ఫ్రాంచైజీ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు చెందినది కావడం, ఆయన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ను ముద్గల్ కమిటీ దాదాపు దోషిగా తేల్చిన నేపథ్యంలో.. ధోనీ, రైనా పాత్రపైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముద్గల్ కమిటీ విచారణలో భాగంగా బుకీ ఉత్తమ్ జైన్ అలియాస్ కిట్టీ.. ధోనీ, రైనా పేర్లు ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News