: నగ్నంగా పోజులిస్తున్న తార.. మోడీకి ఓటెయ్యాలంటూ విజ్ఞప్తి
నరేంద్ర మోడీ భావి ప్రధాని అయ్యేందుకు అన్ని వర్గాలు ఏకమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే పలు వర్గాల నుంచి మద్దతు అందుకుంటున్న మోడీజీకి మోడలింగ్ రంగం నుంచీ 'విశేష సహకారం' అందుతోంది. తాజాగా, మేఘనా పటేల్ అనే యువ మోడల్ మోడీకి ఓటెయ్యాలంటూ నగ్నంగా పోజులిచ్చింది. ఇటీవలే సల్మాన్ ఖాన్, మల్లిక శెరావత్ వంటివారు మోడీకి బహిరంగంగానే తమ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. మేఘన కాస్త వెరైటీగా తనవంతు ప్రచారంతో మోడీకి లబ్ది చేకూర్చాలని భావిస్తోంది. అందుకే, ఒంటిపై నూలుపోగన్నది లేకుండా ఫొటోలకు పోజులిచ్చింది. నగ్నంగా నిలబడి ఉన్న మేఘన.. చేతిలో ఓ పోస్టర్.. దానిపై మోడీకి మీ ఓటు అన్న నినాదం.. ప్రస్తుతం ఈ ఫొటో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. 'కహానీ చంద్రకాంత్ కీ' సీరియల్ లో నటించిన ఈ మోడల్ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆలిండియా ఫేమస్ అవుతుందనడంలో సందేహం అక్కర్లేదేమో!