: వెనక్కి తగ్గేది లేదు.. ఏం చేస్తారో చేసుకోవచ్చు: హర్షకుమార్


కాంగ్రెస్ పార్టీ సస్పెన్సన్ వేటు వేసినంత మాత్రాన తాము వెనక్కి తగ్గేది లేదని ఆ పార్టీ ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని స్వంత పార్టీ నేతలే ఒప్పుకోలేని పరిస్థితి నెలకొందంటే అధిష్ఠానం వాస్తవాలు గుర్తించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తమపై వేటు వేసినంత మాత్రాన కలిగే లాభం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ చర్య కారణంగా తమకు ప్రజల్లో మరింత సానుభూతి లభిస్తుందని ఆయన తెలిపారు. ఇప్పుడు పార్టీ ప్రయోజనాలు ఆశించి పని చేసిన తామంతా మరింత ఉద్ధృతంగా నిరసన తెలుపుతామని ఆయన తెలిపారు.

తాము చాలా సార్లు పార్టీ నేతలను కలిసి వాస్తవాలు, విభజన చేయాల్సిన విధానాన్ని వివరించామని, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తమను సస్పెండ్ చేయడం.. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్క మొరిగినట్టుందని హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర మంత్రులు చిదంబరం, జైరాం రమేష్ ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News