: కోర్ కమిటీ భేటీ తరువాతే బిల్లు ఎక్కడ ప్రవేశపెడతామో చెప్తాం: రాజీవ్ శుక్లా
కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ తరువాతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టేది రాజ్యసభలోనా, లోక్ సభలోనా అనేది తెలుస్తుందని రాజీవ్ శుక్లా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సాయంత్రం జరగనున్న కోర్ కమిటీ భేటీ తరువాత అన్ని విషయాలు వెల్లడిస్తామని అన్నారు.