: పోలీసుల పని పోలీసులు చేస్తారంటున్న సీఎం
సడక్ బంద్ విషయంలో పోలీసుల పని పోలీసులు చేస్తారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రేపు టీఆర్ఎస్ నిర్వహించనున్న సడక్ బంద్ కు అనుమతి ఇవ్వలేదని సీఎం స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో చట్టానికి లోబడే వ్యవహరిస్తామని చెప్పారు. కాగా, అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎల్పీలో చర్చిస్తామని ఆయన అన్నారు.
వ్యవసాయ బడ్జెట్ విషయంలో ప్రతిపక్షాలు నానాయాగీ చేస్తున్నాయని సీఎం విమర్శించారు. అది బడ్జెట్ కాదని, కేవలం కార్యాచరణ ప్రణాళికే అని ఆయన స్పష్టం చేశారు. పొరబాటు కారణంగానే అలా జరగిందని వివరించారు. ఇక విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్సీ సూచనలను మంత్రి వర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.