: విదేశీ గడ్డపై ధోనీ పరాజయాల సారధి


దశాబ్దాల తర్వాత వన్డే ప్రపంచ కప్ ను భారత వశం చేసి సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ధోనీ ప్రశంసలు పొందాడు. కానీ, టెస్టుల్లో మాత్రం మహేంద్రుడు సత్తా చూపలేకున్నాడు. జట్టును విజయతీరాలకు చేర్చలేకున్నాడు. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో ఓటమితో విదేశీ గడ్డపై ధోనీ సారధ్యంలో ఓటమి పాలైన టెస్టు మ్యాచుల సంఖ్య 11. భారత కెప్టెన్లలో ఇంత చెత్త రికార్డు ధోనీకే సొంతమైంది. నిజానికి టెస్టుల నుంచి వైదొలగి 2015 నాటి ప్రపంచకప్ పై దృష్టి సారిస్తానని ధోనీ రెండేళ్ల క్రితమే చెప్పాడు. ఎందుకో గానీ ఇంకా కొనసాగుతూనే పరాజయాలను పోగేసుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News