: నాలుగు రోజులే కీలకం: లగడపాటి
మరో నాలుగు రోజుల పాటు సభలో టీబిల్లును అడ్డుకున్నట్టైతే, రాష్ట్ర విభజన ఆగిపోయినట్టేనని విజయవాడ ఎంపీ లగడపాటి అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ఎంపీలు తక్కువగా ఉండే రాజ్యసభలో అయితే బిల్లును ఆటంకం లేకుండా ఆమోదింపజేసుకోవచ్చన్న హైకమాండ్ కుట్రలు బెడిసికొట్టాయని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో బిల్లు లోక్ సభకే మొదట వస్తుందని... దాన్ని తాము శక్తి వంచన లేకుండా అడ్డుకుంటామని తెలిపారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు కూడా తమతో జతకలవాలని సూచించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన సీమాంధ్ర విద్యార్థి జేఏసీకి లగడపాటి సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.