: అనుష్క శర్మ 'లిప్స్ సర్జరీ' చేయించుకుందా!


ఇటీవల ప్రముఖ హిందీ షో 'కాఫీ విత్ కరణ్'కు హాజరయిన బాలీవుడ్ నటి అనుష్క శర్మను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఆమె పెదాలను చూసి గుసగుసలాడుకున్నారు. అనుష్క తన పెదవులకు ఏదైనా సర్జరీ చేయించుకుందా? అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఇక చానల్స్ అయితే ఆమె పెదాలపై ప;ఉ ప్రత్యేక వార్తలు కూడా ప్రసారం చేశాయి. వాటితో ఇబ్బందిపడిన అనుష్క స్పందించి ట్విట్టర్ లో వివరణ ఇచ్చింది.

'కొన్ని రోజుల నుంచి నా పెదాలపై వస్తున్న వార్తలను గమనిస్తున్నాను. ఆ విషయంపై మాట్లాడదల్చుకున్నాను. బయటి ప్రపంచానికి చాలా తక్కువగా టచ్ లో ఉండే నేను, వ్యక్తిగత విషయం గురించి మాట్లాడటం చాలా కష్టంగా ఉంది. అయినా, చెప్పక తప్పదు కాబట్టి.. తాత్కాలికంగా పెదవులు మెరుగుగా కనిపించేందుకు మేకప్ టెక్నిక్స్ తో ఓ సాధనం ఉపయోగిస్తున్నాను. ఆ కారణంగానే నా పెదాల ఆకారంలో మీకు మార్పు కనిపిస్తోంది. ఇదే వాస్తవం. అంతేకానీ, నేనెలాంటి ప్లాస్టిక్ సర్జరీలకు వెళ్లకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. అయితే, ఈ కొత్త లుక్ కూడా రాబోయే 'బాంబో వెల్వెట్' చిత్రం కోసం మాత్రమే' అని అనుష్క వివరించింది.

  • Loading...

More Telugu News