: ఆ గ్రామాలను సీమాంధ్రలో కలపొద్దు: సోనియాకు విజ్ఞప్తి చేసిన ఖమ్మం జిల్లా నేతలు
ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఆధ్వర్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. భద్రాచలం డివిజన్ లోని పోలవరం ముంపు గ్రామాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని, సీమాంధ్రలో కలపవద్దని కోరారు. సోనియాను కలిసిన వారిలో డిప్యూటి స్పీకర్ మల్లు బట్టివిక్రమార్క, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ ఉన్నారు.