: సభ నిర్వహణలో పూర్తిగా ప్రభుత్వం విఫలం: రవిశంకర్ ప్రసాద్
రాజ్యసభ నిర్వహణలో పూర్తిగా యూపీఏ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సభలు నడవకుండా కాంగ్రెస్ సభ్యులే అడ్డుకుంటున్నారని, సొంత పార్టీ ఎంపీలనే నియంత్రించలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. నిర్వహణలో తన వైఫల్యాన్ని బీజేపీ వైపు నెట్టివేయాలని కాంగ్రెస్ చూస్తోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేసినా ఆయనపై చర్యలు తీసుకోలేదన్నారు. కాగా, షరతులులేని తెలంగాణకు మద్దతిస్తున్నామని.. సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలపై బీజేపీకి స్పష్టత ఉందని తెలిపారు.