: ఏ సభలో ప్రవేశపెట్టాలని న్యాయనిపుణులను అడిగాం: కమల్ నాథ్
రాష్ట్ర విభజన వ్యవహారం చివరి అంకానికి చేరుకున్న సమయంలో... బిల్లుకు ఊహించని సమస్యలు మొదలయ్యాయి. ఈ బిల్లు మామూలు బిల్లా? లేక ఆర్థిక సంబంధిత బిల్లా? అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కమల్ నాథ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై భిన్నాభిప్రాయాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లు ఆర్థికపరమైనదా? అన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి న్యాయనిపుణుల సలహా కోరామని చెప్పారు. అంతేకాకుండా, బిల్లును ఏ సభలో ముందు ప్రవేశపెట్టాలి? అనే అంశంపై కూడా సలహాలను కోరామని తెలిపారు.