: సీఎంతో పాటే నేనూ రాజీనామా చేస్తా: మంత్రి గంటా
రాష్ట్ర విభజన అనివార్యమైతే సీఎం కిరణ్ రాజీనామా చేస్తానని ప్రకటించారని... అదే జరిగితే ఆయనతో పాటే తాను కూడా రాజీనామా చేస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పార్లమెంటులో విభజన బిల్లును ప్రవేశపెట్టకుండా, ఇప్పటివరకు సీమాంధ్ర ఎంపీలు చాలా కష్టపడ్డారని... ఇకపై కూడా అదే ధోరణి కొనసాగిస్తారని చెప్పారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతులు పాటించలేదని విమర్శించారు. ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.