: కాంగ్రెస్ పార్టీ తప్పిదాల్లో బీజేపీ భాగస్వామి కాలేదు: బీజేపీ
జాతీయ పార్టీ అయిన బీజేపీ... రాష్ట్ర విభజన సమస్యను అన్ని కోణాల నుంచి చూస్తుందని సీమాంధ్రకు చెందిన బీజేపీ నేతలు ఢిల్లీలో తెలిపారు. సీమాంధ్ర సమస్యలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ అనేక సూచనలు చేసిందని... యూపీఏ ప్రభుత్వం వాటిని ఎంతవరకు పట్టించుకుంటుందో వేచి చూస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా చేస్తున్న కుట్రలో బీజేపీ భాగస్వామి కాలేదని స్పష్టం చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉందని... అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను ఏర్పాటు చేయడమే కాక... సీమాంధ్ర ప్రాంత సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు.