: తాగిన మత్తులో తండ్రినే హతమార్చాడు


మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్న తండ్రినే హతమార్చాడు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లిలో జరిగింది. జూకంటి రమేష్ అనే వ్యక్తి మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున మద్యం మత్తులో తన తండ్రి ఓదేలు (55)ను కొడవలితో నరికి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News