: సీఎం రాజీనామా చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ అభాసుపాలవుతుంది: సబ్బం హరి
ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తే... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభాసుపాలవుతుందని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి అభిప్రాయపడ్డారు. సీఎం రాజీనామా చేస్తారన్న భయంతోనే కేంద్ర ప్రభుత్వం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి భయపడుతోందని చెప్పారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో టీబిల్లును ప్రవేశ పెట్టడం ఇబ్బందికరంగా తయారవడంతోనే... కాంగ్రెస్ అధిష్ఠానం రాజ్యసభను ఎంచుకుందని... ఇప్పుడు అక్కడ కూడా బిల్లును ప్రవేశపెట్టలేని పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో బిల్లును అడ్డుకుంటామని తెలిపారు.