: అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు
టీబిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టకుండా ఉండేందుకు సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వంపై వీరు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, శివప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల కిష్టప్పలు తీర్మానం నోటీసును స్పీకర్ మీరాకుమార్ కు అందజేశారు.