: అలాంటి వీడియోలు పంపేది మహిళలే ఎక్కువట!


యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తయారీదారు మెకాఫీ సంస్థ భారత్ లో ఓ ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. అందులో వెల్లడైన ఫలితాలు ఆశ్చర్యం కలిగించకమానవు. పురుషుల కంటే అధికంగా స్త్రీలే తమ ముద్దముచ్చట్లను వీడియోలో చిత్రీకరించి మిత్రులకు మొబైల్ ద్వారా పంపుతున్నారట. శృంగార భరితమైన టెక్స్ట్ మెసేజిలు, ఎమ్మెమ్మెస్ లు పంపుతామని 59 శాతం మంది మహిళలు అంగీకరించగా, ఈ విషయంలో పురుషుల శాతం 57. ఇక, ఇలాంటి ప్రైవేటు విషయాలను వీడియోల్లో బంధిస్తామని 30 శాతం మంది మహిళలు తెలుపగా, ఈ విషయంలోనూ పురుషుల శాతం దిగదుడుపే. 27 శాతం మందే తమ వ్యక్తిగత విషయాలను చిత్రీకరిస్తామని చెప్పారు. 18-54 ఏజ్ గ్రూప్ లో ఉన్న 1008 మంది భారతీయులపై సర్వే నిర్వహించి ఈ వివరాలు రాబట్టారు.

  • Loading...

More Telugu News