: ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి మద్దతు విరమించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యే
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యే రాంభీర్ షొకీన్ మద్దతు విరమించుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేనే ఓ ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన హామీలను పూర్తిగా తీర్చలేకపోయారని, అందుకే తన మద్దతును వెనక్కి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కలిసి తన నిర్ణయాన్ని తెలపనున్నారు. ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి విలేకరులకు చెబుతానన్నారు. రాంభీర్ ఢిల్లీలోని ముండ్కా నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు.