: మైనార్టీలకోసం ఇస్లామిక్ బ్యాంకు: చంద్రబాబు
తాము అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమంకోసం ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. మత పెద్దలకు గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు. వస్త్రాలమీద విధిస్తోన్న వ్యాట్ రద్ధు చేస్తామని బాబు వాగ్దానం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాదయాత్రలో ఆయన ఈ హామీలు కురిపించారు.
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని చంద్రబాబు ఆరోపించారు. రాని కరెంట్ కు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఛార్జీలు పెంచుతున్నాడని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు కోట్లకు కోట్లు అవినీతి సొమ్ము సంపాదించాడని బాబు విమర్శించారు.