: పంపకాలు సరిగాలేవు.. గవర్నర్ చేయగలిగేది ఏదీ లేదు: పల్లంరాజు
రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాదులో సీమాంధ్రులకు రక్షణ ఉండదని కేంద్ర మంత్రి పళ్ళంరాజు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో హైదరాబాద్ గవర్నర్ చేయగలిగేది ఏదీ ఉండదని అన్నారు. సీమాంధ్రుల రక్షణపై తామేమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీవోఎం కేంద్ర మంత్రుల సూచనలను కూడా లెక్క చేయలేదని ఆయన మండిపడ్డారు. జీవోఎం హైదరాబాద్ ఆదాయపంపకాలు కూడా సరిగా చేయలేదని ఆయన విమర్శించారు. దీని కారణంగా సస్యశ్యామలంగా ఉన్న ఆంధ్రలో తీవ్రమైన ఆదాయలోటు ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. రాయలసీమ పరిస్థితి మరింత తీసికట్టుగా తయారవుతుందని పళ్ళంరాజు తెలిపారు.