: ఢిల్లీకి పయనమవుతున్న చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో సమావేశమైన అనంతరం షెడ్యూల్ ప్రకారం హైదరాబాదు రావాల్సి ఉంది. అయితే తెలంగాణ ముసాయిదా బిల్లును రేపు (మంగళవారం) రాజ్యసభలో ప్రవేశపెడుతున్నందున ఆయన తన షెడ్యూల్ ను మార్చుకున్నారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు కోల్ కతా నుంచి బయల్దేరి చంద్రబాబు నేరుగా ఢిల్లీకి పయనమవుతున్నారు.