: మోడీ పాక్, చైనా తీవ్రవాది కాదు: రౌత్
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కలవడంపై మహారాష్ట్రలో పెను దుమారమే రేగుతోంది. దీనిపై పలు పార్టీలు రకరకాలుగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అనవసర రాద్ధాంతం చేస్తున్నారని శివసేన నేత సంజయ్ రైత్ ఇతర పార్టీల నేతలపై మండిపడ్డారు. నరేంద్ర మోడీ పాకిస్థాన్ లేక చైనా దేశాలకు చెందిన తీవ్రవాది కాదని అన్నారు. మోడీని ఎవరైనా, ఎప్పుడైనా కలవొచ్చని, ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి కలవడం సాధారణ విషయమేనని తేల్చిచెప్పారు. దీనిపై అనవసర రాజకీయాలు మానుకోవాలని రౌత్ హితవు పలికారు. కాగా, మోడీని కలిసినట్టు వచ్చిన వార్తలను మరోపక్క శరద్ పవార్ ఖండించారు.