: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్ఎస్ సి బోర్డు అధికారులు ఈ రోజు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 12 లక్షల 36వేల మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరికోసం 5,646 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. హాల్ టికెట్ అందని విద్యార్ధులు ఎస్ఎస్ సి వెబ్ సైటు నుంచి డౌన్ లోడు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 10తో పరీక్షలు ముగుస్తాయని, మేలో ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.